ఆసియా కప్ 2023: కీలక మ్యాచ్ లో బ్యాటింగ్ చేయనున్న పాకిస్తాన్ … !

-

ఈ రోజు శ్రీలంక మరియు పాకిస్తాన్ ల మధ్యన జరగనున్న సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ కు వెళ్లే పరిస్థితి. కానీ మ్యాచ్ వర్షం కారణంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరగలేదు. దీనితో అంపైర్లు మ్యాచ్ ను 45 ఓవర్లకు కుదించారు. దానితో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది, ఇప్పటికే ఇండియా వరుసగా పాకిస్తాన్ మరియు శ్రీలంక ల మీదనా గెలిచి ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన మరో బెర్త్ కోసం ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. కాగా పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో ఏకంగా 5 మార్పులు చేయడం విశేషం.. హరీష్ రాఫ్ నసీం షా లు గాయం కారణంగా లేకపోవడంతో… మహమ్మద్ వసీం జూనియర్ మరియు జమాన్ ఖాన్ లు జట్టులోకి వచ్చారు. ఫహీమ్ అష్రాఫ్ , ఆఘ సల్మాన్ మరియు ఇమామ ఉల్ హాక్ లకు బదులుగా నవాజ్, షఫీక్ మరియు మహమ్మద్ హరీష్ లను తీసుకుంది.

ఇక శ్రీలంక కూడా రెండు కీలక మార్పులు చేసింది.. కుషాల్ పెరీరా మరియు ప్రమోద్ మధుశన్ జట్టులోకి రాగా రజిత మరియు కరుణరత్నే లు బెంచ్ కు పరిమితం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news