తెలంగాణాలో అసీంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలలో భయం ఎక్కువవుతోంది. ఈసారి జరగనున్న ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం కానున్నాయి. ఒకవేళ కేసీఆర్ సారధ్యంలోని BRS మళ్ళీ గెలిస్తే ఇక బీజేపీ, కాంగ్రెస్ లు తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే, భవిష్యత్తులో ఇక కేసీఆర్ ను టచ్ చేసే అవకాశమే ఉండదు. అందుకే కాంగ్రెస్ మరియు బీజేపీలు గట్టిగా కేసీఆర్ ను ఓడించాలని విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మాపై ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో BRS మరియు BJP లు కలిసి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ముమ్మాటికీ తప్పు ప్రచారమేనని కిషన్ రెడ్డి గట్టిగా చెప్పారు. తెలంగాణాలో మా పోరు ఏకపక్షముగానే సాగుతుందని.. ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి.
ఇంకా కాంగ్రెస్ – మజ్లీస్ మరియు BRS లు కలిసి పోటీ చేస్తాయంటూ కామెంట్ చేశారు కిషన్ రెడ్డి. ఇక ముందస్తు ఎన్నికల గురించి జరుగుతున్న చర్చలో ఎటువంటి వాస్తవం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.