ఆసియా కప్ 2023: వర్షం పాకిస్తాన్ కు షాక్ ఇస్తుందా ?

-

ఆసియా కప్ 2023 లో ఇక మిగిలింది మూడు జట్లు అనుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ తాము ఆడిన రెండు మ్యాచ్ లలో ఓటమి పాలు అయ్యి ఫైనల్ బెర్త్ ను పోగొట్టుకుంది అని చెప్పాలి. ఇక వరుస విజయాలతో ఇండియా ఫైనల్ లో చోటు కంఫర్మ్ చేసుకుంది. కాగా ఈ రోజు కొలంబో వేదికగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ ఇరు జట్లకు సెమీఫైనల్ లాంటిది..కాగా ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా ఇప్పటికే రెండు సార్లు అంతరాయం కలిగింది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తోంది… ఈ సిరీస్ లో మరోసారి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మరియు పఖార్ జమాన్ లు ఫెయిల్ అయ్యారు. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక వర్షం కారణంగా ఫలితం రాకుండా ఆగిపోతే… పాకిస్తాన్ కు తీవ్ర నష్టం అని చెప్పాలి. ఇరు జట్లకు అప్పుడు చెరో పాయింట్ దక్కుతుంది.

కానీ పాయింట్ ల పట్టికలో పాకిస్తాన్ కన్నా శ్రీలంక మెరుగ్గా ఉంది. కానీ వరుణుడు పాకిస్తాన్ కు షాక్ ఇస్తాడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news