సిద్దిపేట, సిరిసిల్లలో తప్ప మరెక్కడా డబుల్ బెడ్ రూములు ఇవ్వలేదు : జూపల్లి కృష్ణారావు

-

నాగర్ కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి జరుగకపోతే రాష్ట్రంలోని అన్నీ స్కీములు పూర్తయ్యేవి. మోటార్ పంపుల విషయంలో రూ.800 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపించారు జూపల్లి. తెలంగాణలో జరిగిన అవినీతి విషయంలో సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రతీ దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తానని.. కేసీఆర్ ఇవ్వలేదన్నారు. 2వేల నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక కుటుంబానికి కూడా ఉద్యోగం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట సిరిసిల్లలో తప్పా డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేయలేదని.. జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కేసీఆర్ కి ప్రజలే తగిన బుద్ది చెబుతారని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news