ASIA CUP FINAL: సిరాజ్ బౌలింగ్ కు షాక్ అయిన శ్రీలంక మహిళా అభిమాని… !

-

నిన్న కొలంబోలో ఇండియా మరియు శ్రీలంక ల మధ్యన జరిగిన మ్యాచ్ ఏకపక్షముగా ముగిసిన విషయం తెలిసిందే. సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై కష్టంగా గెలిచి ఫైనల్ కు చేరుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. మొదట టాస్ గెలిచినా శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుని తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఈ ఫలితంగా శ్రీలంక బ్యాటింగ్ లో కేవలం 50 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి దారుణమైన ఓటమికి కారణం అయింది. శ్రీలంక ను అల్ అవుట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన స్పీడ్ బౌలర్ సిరాజ్ తన స్పెల్ లో మొత్తం 6 వికెట్లు పడగొట్టి శాసించాడు. కాగా ఇందులో సిరాజ్ ఒకే ఓవర్ లో ఏకముగా నాలుగు వికెట్లు పడగొట్టి పట్టపగలే శ్రీలంక ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. కాగా ఈ మ్యాచ్ లైవ్ చూస్తున్న శ్రీలంక మహిళా అభిమాని రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈమె సిరాజ్ వేసిన బంతులకు అసలు ఏమి జరుగుతోందో అర్ధం కాకుండా పేస్ రియాక్షన్ ఇచ్చింది.. ఈమె ముఖంలో అర్ధం కాని ఆందోళన, బాధ, ఆశ్చర్యం కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news