పార్లమెంట్ లో చంద్రబాబు అరెస్ట్ అంశం.. ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరిన ఎంపీ గల్లా ..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పార్లమెంట్ లో ఇవాళ చర్చలు జరిగాయి. ఇవాళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్ పాతభవనంలో ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ఇవాళే చివరిరోజు. ఇక రేపటి నుంచి నూతన భవనంలో పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమయంలో టీడీపీ లోక్ సభ పక్ష నేత గల్లా జయదేవ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. వైసీపీ నేత మిథున్ రెడ్డి కౌంటర్ చేశారు. ఈ సమయంలో స్పీకర్ స్పష్టత ఇచ్చారు.

చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ లోక్ సభలో లేవనెత్తింది. మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ ఏపీ చరిత్రలో బ్లాక్ డే గా ఎంపీ జయదేవ్ పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. అరెస్ట్ సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రధాని, హోంమంత్రి, అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు చౌకబారు ఎత్తుగడలు వేశారని విమర్శించారు. చంద్రబాబుకి డబ్బు అందినట్టు ఎలాంటి ఆరోపణలు చూపలేదన్నారు. రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు ఆపేవిధంగా ప్రధాని చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబును విడుదల చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news