ఈ రోజు ఆసియన్ గేమ్స్ లో భాగంగా జరిగిన మరో సెమీఫైనల్ లో పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ లు తలపడిన విషయం తెలిసిందే. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ ను సమర్ధవంతమైన బౌలింగ్ తో కేవలం 18 ఓవర్లకే 115 పరుగుల వద్ద ఆల్ అవుట్ చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ అహమద్ మూడు, కయీస్ అహ్మద్ రెండు మరియు జహీర్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం పరుగుల లక్ష్యంతో వచ్చిన ఆఫ్ఘన్ ఒకానొక సమయంలో ఓటమి చెందే పరిస్థితి నెలకొంది.. కానీ కెప్టెన్ గుల్బదీన్ నాయబ్ ఎంతో సమయస్ఫూర్తితో ఆడి జట్టును ఫైనల్ కు చేర్చాడు.. మరో 13 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను పూర్తి చేశాడు.
ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ మొదటిసారి ఫైనల్ లో ఇండియాను ఢీకొనబోతోంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ఫేవరెట్ పాకిస్తాన్.. కానీ అనవసర షాట్ లు ఆడి వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పై ఆఫ్ఘన్ పట్టుబిగించింది.