మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి రావడం వల్ల..ఆ పార్టీ బలం ఎంత పెరిగిందో తెలియదు గాని..ఆయన రాక వల్ల కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడటం నష్టం చేకూర్చేలా ఉంది. మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లికి మళ్ళీ బిఆర్‌ఎస్ లో సీటు దక్కింది. కానీ తన తనయుడు రోహిత్‌కు మెదక్ సీటు ఆశించారు. అది దక్కలేదు. హరీష్ రావు అడ్డుపడటం వల్లే తన తనయుడుకు సీటు రాలేదని ఫైర్ అయ్యారు. హరీష్ పై విరుచుకుపడ్డారు.
ఇక తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి..తన తనయుడుని తీసుకుని కాంగ్రెస్ లోకి వచ్చేశారు. అలాగే కాంగ్రెస్ లో రెండు సీట్లు ఫిక్స్ అయ్యాయి. మైనంపల్లికి మల్కాజిగిరి, రోహిత్‌కు మెదక్ సీటు ఫిక్స్ అయింది. కానీ ఇక్కడే అసలు సమస్య వచ్చింది. మైనంపల్లి రాకతో మల్కాజిగిరి, మెదక్ ల్లో కాంగ్రెస్ బలం ఎంతవరకు పెరిగిందో తెలియదు..కానీ ఆయన రాక వల్ల బలమైన నేతలు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు.
మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ అనూహ్య పరిణామంతో కాంగ్రెస్ నేతలు డైలామాలో పడిపోయారు. మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్ ఇవ్వడంతో శ్రీధర్ మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. కాగా.. నందికంటి శ్రీధర్ త్వరలో చేరనున్నట్లు సమాచారం. అటు మెదక్ సీటు మైనంపల్లి తనయుడుకు కేటాయిస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నేత కంటారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
ఇలా కీలక నేతలు రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. వారి అనుచరులు సైతం కాంగ్రెస్‌ని వదిలేసి బిఆర్‌ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్‌కు నష్టం తప్పదు. మరి ఈ నష్టాన్ని భర్తీ చేసి రెండుచోట్లా మైనంపల్లి గెలుస్తారేమో చూడాలి.