ASIAN GAMES 2023: ఇండియాకు హాకీలో గోల్డ్ మెడల్ … !

-

ఆసియన్ గేమ్స్ లో ఇండియా మరో గోల్డ్ మెడల్ ను కాసేపటి క్రితమే గెలుచుకుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం హాకీ విభాగంలో పురుషుల జట్టు ఫైనల్ లో జపాన్ పై విజయాన్ని సాధించి ఇండియా గోల్డ్ మెడల్ ను సాధించింది. ఇక ఫైనల్ లో ఓడిపోయిన జపాన్ కాంస్య పతకం దక్కించుకుంది. మ్యాచ్ లో నిర్ణీత సమయం పూర్తి అయ్యే లోపు ఇండియా 5 – 1 గోల్స్ తేడాతో స్పష్టమైన ఆధిక్యాన్ని అందుకుని జపాన్ ను చిత్తు చేసింది. ఇక ఆసియన్ గేమ్స్ చరిత్రలో ఇండియా మెన్ కు ఇది నాలుగవ గోల్డ్ మెడల్ కావడం విశేషం. ఇంతకు ముందు ఆసియన్ గేమ్స్ 1966, 1988, 2014 మరియు 2023 లో గోల్డ్ మెడల్స్ ను సాధించింది..

కాగా ఈ విజయంతో వచ్చే సంవత్సరం పారిస్ లో జరగనున్న ఒలింపిక్ గేమ్స్ కు వెళ్ళడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఇండియా హాకీ పురుషుల జట్టు ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకునే పనిలో పడింది.

Read more RELATED
Recommended to you

Latest news