వరల్డ్ కప్ లో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ నెదర్లాండ్ తో తలపడుతోంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో 286 పరుగులు చేసి, పసికూన నెథర్లాండ్ ముందు ఛాలెంజింగ్ టోటల్ ను ఉంచింది. వాస్తవానికి పాకిస్తాన్ జట్టును ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది నెదర్లాండ్. పాకిస్తాన్ ఆటగాళ్లలో రిజ్వాన్ మరియు షకీల్ లు చెరో 68 పరుగులు చేశారు. ఆ తర్వాత మ్యాచ్ ను తమ భుజాలపై మోసింది మాత్రం మహమ్మద్ నవ్వాజ్ 39 మరియు షదబ్ ఖాన్ 32 లు అని చెప్పాలి.. వీరిద్దరూ ఏడవ వికెట్ కు 64 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను కాపాడారు. ఆఖర్లో హరీష్ రఫ్ 16 మరియు ఆఫ్రిది 13 లు తలో చెయ్యి వేసి జట్టు స్కోర్ ను 286 కు తీసుకువెళ్లారు.
ఇక నెథర్లాండ్ బౌలర్లలో ఆల్ రౌండర్ బస్ డే లీడ్ 4 వికెట్లు , యాకర్మాన్ 2 వికెట్లు తీసుకున్నాడు. మరి పాకిస్తాన్ ఇచ్చిన 287 పరుగుల టార్గెట్ ను నెదర్లాండ్ ఛేదిస్తుందా చూడాలి.