జూబ్లీహిల్స్ పబ్ లో యువతిపై లైంగిక దాడి

మహిళలపై మనదేశంలో లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలను తీసుకువచ్చిన అప్పటికీ… మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ములన కొందరు దుర్మార్గులు మహిళలపై దాడులు చేస్తున్నారు.

అయితే తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ కెమిస్ట్రీ పబ్ లో ఓ యువతిపై లైంగిక దాడి జరిగింది. పబ్ లో పనిచేస్తున్న యువతిపై.. లైంగిక దాడికి పాల్పడ్డాడు అందులో వంట చేసే ఓ వ్యక్తి. ఎప్పటినుంచో ఆ యువతి పై కన్నేసిన ఆ వ్యక్తి… ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయం బయట పడడంతో.. ఆ వ్యక్తిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు యువతి కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఈ ఘటనపై కెమిస్ట్రీ పబ్ ఓనర్ సంతోష్ కుమార్ స్పందించాడు. ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని… నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.