అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నడపాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆనాటి రోజులు ఎందుకు వచ్చాయి? అని నిలదీశారు. అది పీసీ ఘోష్ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు 15 రోజులు అసెంబ్లీ నడపాలని కోరారు. మీకు నచ్చిన రెండు మూడు అంశాలు మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదు అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.
కాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా జాతీయ గీతాన్ని ఆలపించారు తెలంగాణ ఎమ్యెల్యేలు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యంగా… గణపతి బప్పా మోరియా కావలయ్యా యూరియా అంటూ నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలు. గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన కొనసాగింది.