హత్య కుట్రపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు..? జిల్లా ఎస్పీకి 3 రోజుల ముందే ఈ వీడియో గురించి తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు..? అని నిలదీశారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు నన్ను చంపే కుట్రకు సంబంధించిన వీడియో చూసి షాక్ అయ్యా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

ఇక అటు నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయానికి భారీగా చేరుకున్న కోటంరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. రౌడీ మూకలకు కొమ్ముకాస్తున్న ఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.
నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయానికి భారీగా చేరుకున్న కోటంరెడ్డి అనుచరులు
రౌడీ మూకలకు కొమ్ముకాస్తున్న ఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు pic.twitter.com/0HfuKix65B
— BIG TV Breaking News (@bigtvtelugu) August 30, 2025