అసెంబ్లీ వార్: బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరు?

-

మళ్ళీ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి…ఈ సారి సమావేశాలు చాలా హాట్ హాట్‌గా సాగేలా ఉన్నాయి…అయితే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు వస్తేనే…కాస్త సభ రసవత్తరంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. లేదంటే అసెంబ్లీలో టీఆర్ఎస్ వన్ సైడ్ గా బీజేపీని టార్గెట్ చేసి విమర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పర్యటనకు వచ్చి…రేషన్ బియ్యం పంపిణీ విషయంలో రేషన్ దుకాణాల వద్ద మోదీ ఫోటో విషయంలో…తెలంగాణ సర్కార్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎక్కువ అని, అలాగే రేషన్ దుకాణాల వద్ద మోదీ ఫోటో పెట్టాలని, లేదంతా తానే ఫ్లెక్సీ కడతానని చెప్పి నిర్మలా..కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనిపై టీఆర్ఎస్ సైతం గట్టిగా కౌంటర్లు ఇచ్చింది. కానీ కేసీఆర్ దీనిపై స్పడించలేదు.

అసెంబ్లీ సమావేశాలు వేదికగా కేసీఆర్..మళ్ళీ బీజేపీని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వస్తారో లేదో క్లారిటీ లేదు. ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్స్‌లో బీజేపీ ఎమ్మెల్యేల్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్‌ చేశారు. అప్పటి సెషన్స్‌ ముగిసేవరకూ సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటి సెషన్స్‌కు కొనసాగింపు గానే ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలని అసెంబ్లీలోకి రానిచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మరి దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇక అటు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్ పీడీయాక్ట్ కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. మరి ఆయన బదులు ఈటల రాజేందర్‌ని గాని, రఘునందన్ గాని బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేస్తారో లేదో చూడాలి. అటు కాంగ్రెస్‌లో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు…పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికైతే బీజేపీ ఎమ్మెల్యేల విషయమే క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version