భూమికి చేరువలో అతిపెద్ద గ్రహశకలం.. నేడే రాబోతుంది.

-

భూమికి అత్యంత సమీపంలోకి గ్రహశకలం రాబోతుంది. భూమి నుండి 1.4మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహశకలం తిరగనుంది. 6దశాబ్దాల కాలం తర్వాత మొట్ట మొదటిసారిగా ఇంత సామీప్యంలోకి రావడం ఇదే తొలిసారి. నాసా ప్రకారం 2016 AJ193 అనే పేరుగల ఈ గ్రహ శకలం భూమి మీద ఉన్న ఎన్నో వస్తువుల కంటే పెద్దదిగా ఉండనుంది. గంటకు 94,208కిలోమీటర్ల వేగంతో తిరిగే 1.4కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ గ్రహశకలాన్ని టెలిస్కోప్ సాయంతో చూడవచ్చు.

న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగు అంత పెద్దగా కనిపించే ఈ ఆస్టరాయిడ్ భూమికి సామీప్యంగా రావడం కొంత ఆందోళనకు కలిగించే విషయమే అని, కాకపోతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8:40నిమిషాలకు గ్రహశకాలం భూమికి అత్యంత సమీపానికి రానుందని, 8ఇంచుల టెలిస్కోప్ తో ఇది చూడవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news