అసుస్ నుంచి కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధ‌ర కేవ‌లం రూ.25,323 నుంచే ప్రారంభం..

అసుస్ కంపెనీ భార‌త్‌లో ఎక్స్‌ప‌ర్ట్ బుక్ సిరీస్‌లో నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను విడుద‌ల చేసింది. వాణిజ్య అవ‌స‌రాల కోసం వినియోగ‌దారుల‌కు వీటిని అసుస్ అందిస్తోంది. ప‌ని చేసుకునేవారితోపాటు వ్యాపారం చేసుకునే వారికి ఈ ల్యాప్‌టాప్‌లు అనువుగా ఉంటాయ‌ని తెలిపింది. ఈ క్ర‌మంలోనే ఈ ల్యాప్‌టాప్‌ల‌లో ట్ర‌స్టెడ్ ప్లాట్‌ఫాం మాడ్యూల్ 2.0 (టీపీఎం) సెక్యూరిటీ చిప్‌ల‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల ఈ ల్యాప్‌టాప్‌ల‌లో యూజ‌ర్ల డేటా సురక్షితంగా ఉంటుంది. అలాగే వైఫై 6, థండ‌ర్ బోల్ట్ 3 క‌నెక్టివిటీ, ఇంటెల్ 10వ జ‌న‌రేష‌న్ కోర్ ప్రాసెస‌ర్ల‌ను కూడా ఈ ల్యాప్‌టాప్‌ల‌లో ఏర్పాటు చేశారు.

asus launched expert book series laptops in india

అసుస్ మొత్తం 3 ల్యాప్‌టాప్‌ల‌ను ఎక్స్‌ప‌ర్ట్ బుక్ సిరీస్‌లో లాంచ్ చేసింది. వాటిల్లో ఎక్స్‌ప‌ర్ట్ బుక్ బి9, ఎక్స్‌ప‌ర్ట్‌బుక్ పి2, ఎక్స్‌ప‌ర్ట్ బుక్ పి1 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. ఎక్స్‌ప‌ర్ట్ బుక్ బి9 ల్యాప్‌టాప్‌ల‌లో 14 ఇంచుల డిస్‌ప్లే, 16 జీబీ వ‌ర‌కు ర్యామ్, 24 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ఎక్స్‌పర్ట్ బుక్ పి2 సిరీస్ ల్యాప్‌టాప్‌ల‌లో ఎన్‌వీడియా గ్రాఫిక్ కార్డులు, 13 గంట‌ల వ‌ర‌కు బ్యాటరీ బ్యాక‌ప్‌, యూఎస్‌బీ టైప్ సి పోర్టులు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ఎక్స్‌ప‌ర్ట్ బుక్ పి1 సిరీస్ ల్యాప్‌టాప్‌లు 14, 15 ఇంచ్ మోడ‌ల్స్‌లో ల‌భిస్తున్నాయి. వీటిల్లో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెస‌ర్ల‌ను అమ‌ర్చారు. మిలిట‌రీ గ్రేడ్ 810 జి స‌ర్టిఫైడ్ నాణ్య‌త‌తో వీటిని త‌యారు చేసినందున ఇవి ఎక్కువ కాలం మ‌న్నుతాయి. కింద ప‌డ్డా అంత సుల‌భంగా ప‌గిలిపోవు. వీటిల్లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, హెచ్‌డీ కెమెరా వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

అసుస్ ఎక్స్‌ప‌ర్ట్ బుక్ బి9 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధ‌ర రూ.1,02,228గా ఉంది. అలాగే ఎక్స్‌ప‌ర్ట్ బుక్ పి2 ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధ‌ర రూ.58,697గా ఉంది. ఎక్స్‌ప‌ర్ట్ బుక్ పి1 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధ‌ర రూ.25,323గా ఉంది. వీటితోపాటు అసుస్ ఎక్స్‌ప‌ర్ట్ సిరీస్ డెస్క్‌టాప్‌ల‌ను కూడా లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధ‌ర రూ.25,839గా ఉంది. వీటిని అన్ని ఆన్‌లైన్ స్టోర్లు, ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో విక్ర‌యిస్తున్నారు.