ఆప్ఘనిస్థాన్ లోని ఖార్వార్ జిల్లా తూర్పు లోగార్ ప్రావిన్స్‌లో భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా దళాలు చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో 13 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఇక ప్రశాంతంగా ఉన్న ఖార్వార్ జిల్లాలో యుద్ధ వాతారణం నెలకొంది. ఆ ప్రాంతంలో గత రెండు వారాలుగా తాలిబన్లు వరుస దాడులకు పాల్పడ్డారు. దీంతో ఉగ్రవాదులను ఏరివేయడానికి ప్రభుత్వ భద్రతా దళాలు, ఆర్మీ, పోలీసులు రంగంలోకి దిగాయి.
ఇక ఆప్ఘనిస్థాన్ లో బుధవారం ఈ ఆపరేషన్ అమలు చేశారు. అయితే ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు 13 మంది ముష్కరులను మట్టు బెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను తూర్పు లోగార్ ప్రావిన్స్ పోలీస్ అధికార ప్రతినిధి షాపూర్ అహ్మాద్‌జై తెలిపారు. భద్రతా దళాల్లో ఎవ్వరూ గాయపడలేదని తెలిపారు. ఇక ఆపరేషన్ చివరి దశలో ఉందని ఆయన తెలిపారు. భద్రతా దళాల ఆపరేషన్‌పై తాలిబన్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు.