ప్రస్తుతం ఇండియా అప్పులు రూ.152 లక్షల కోట్లు : సీఎం కేసీఆర్

-

తెలంగాణ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోందని.. ఈ విషయాన్ని ఆర్బీఐ చెబుతోందన్నారు సీఎం కేసీఆర్‌. ప్రభుత్వ పథకాలు లబ్ది దారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగరజారడానికి కరోనా సాకు సాదన్న కేసీఆర్‌… కరోనా కంటే ముందే దేశాభివృద్ది రేటు దిగజారిందని ఆరోపించారు. ప్రస్తుతం ఇండియా అప్పు రూ.152 కోట్లు ఉందని ఆయన వెల్లడించారు.

మన ఉద్యోగులకు కడుపునిండా జీతం ఇస్తున్నామని.. కింది స్థాయి ఉద్యోగులకు కూడా 30 శాతం జీతాలు పెంచామని కేసీఆర్ అన్నారు. సెర్ఫ్ లో పని చేస్తున్న 4 వేల కన్న పైచిలుకు మందికి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇస్తామని ఆయన అన్నారు.

మహిళా సంఘాల్లో అవేర్నెస్ పెంచుతున్నారని.. మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబు ఇచ్చారు. ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగస్తులు కారని.. గతంలో సమ్మెకు వెళ్లారని.. వాళ్ల మీద మాకు కోపం లేదని.. కానీ మళ్లీ నేను హెచ్చరిక పూర్వకంగా చెబుతున్నానని.. ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version