రైతుల నిరసనల వేళ….. ప్రధాని నరేంద్ర మోదీ పోస్టు

-

కనీస మద్దతు ధర కి చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్రం చెరకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిందని నరేంద్ర మోడీ ఎక్స్‌ వేదికగా స్పందించారు.దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు సంబంధించి ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చెరకు కొనుగోలు ధర పెంపునకు ఆమోదం లభించిందని ,కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది’ అని మోడీ పోస్టు చేశారు.

బుధవారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ గతంతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.25 పెంచింది.దీంతో మద్దతు ధర రూ.340కు చేరింది. ఈ సవరించిన ధర 2024 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది.నిరసన ఉద్ధృతం అయిన నేపథ్యంలో ఇప్పటికే నాలుగు దఫాలుగా కేంద్రం, రైతుల సంఘాల మధ్య చర్చలు జరిగినప్పటికీ పురోగతి కన్పించకపోవడంతో ఐదో రౌండ్‌ చర్చలకు రైతు నేతలను కేంద్రం ఆహ్వానించింది.

Read more RELATED
Recommended to you

Latest news