సోషల్ మీడియాలో అకాయ్ AI ఫొటోలు వైరల్

-

విరాట్ కోహ్లి- అనుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమారుడికి ‘అకాయ్’ అని పేరు కూడా పెట్టారు. జూనియర్ విరాట్ ఎలా ఉంటాడో చూడటానికి అభిమానులు ఆసక్తి చూపుతుండగా కొందరు AI సాయంతో అకాయ్ ఫొటోలను క్రియేట్ చేశారు. ఇవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్ కపుల్ తమ కుమార్తె వామిక ముఖాన్ని కూడా ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి చూపించలేదు.అంతే కాకుండా మరోసారి తండ్రి అయినట్లు విరాట్ ప్రకటించిన వెంటనే ఇన్స్టాలో ‘అకాయ్ కోహ్లి’ పేరుతో పెద్దసంఖ్యలో ఫేక్ అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. వాటికి విరుష్క దంపతుల ఫొటోలను డీపీలుగా పెట్టారు.

ఇకపోతే విరుష్క దంపతులు 2013 లో ఒక షాంపూ యాడ్ ద్వారా కలుసుకున్న వారు ఇరు కుటుంబాలను ఒప్పించి.. ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news