చెన్నైలో దారుణం.. సూట్‌కేసులో ముక్కలుగా నరికిన యువతి డెడ్‌బాడీ!

-

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో రెండు షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకటి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాగా, మరొకటి ఒళ్లుగగుర్పొడిచేలా యువతిని హత్య చేసి ముక్కలుగా నరికి సూట్‌కేసులో పెట్టారు. వివరాల్లోకివెళితే.. చెన్నైలోని తురైపాకంలో రోడ్డు పక్కన ఓ సూట్‌కేసు లభ్యమైంది. దానిని తెరచి చూడగా అందులో యువతి డెడ్‌బాడీ ఉంది.ముక్కలు ముక్కలుగా యువతి శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.ఇంతకూ ఆ యువతి ఎవరు? ఆమెను ఎవరు ఇలా దారుణంగా హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదిలాఉండగా, చెన్నైలోని విరుదునగర్‌లో భారీ పేలుడు సంభవించింది. టపాసులు దుకాణంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో టపాసులు కొనేందుకు వచ్చిన ఆటో డ్రైవర్ మృతి చెందగా, అందులో పనిచేసే ఆరుగురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news