పోగొట్టుకున్న చోటే.. పట్టు కోసం జగన్ వ్యూహాలు.. నెల్లూరు జిల్లాపై ఫోకస్..

-

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే జిల్లాలలో నెల్లూరు జిల్లా ముందుంటుంది.. జగన్ సొంత జిల్లాగా ఉన్న కడప కన్నా నెల్లూరు జిల్లాలోనే పార్టీకి బలం ఎక్కువ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి. జిల్లా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కును చేర్చుకున్నారు.. మరి అలాంటి జిల్లాలో గత ఎన్నికల్లో వైసిపి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు ఉంటే.. అన్ని నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే గెలుపొందారు.. దీంతో ఈ జిల్లాలో మళ్లీ పట్టు పెంచుకునేందుకు వైసిపి అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.. పోగొట్టుకున్న చోటే పట్టు పెంచుకునేందుకు.. జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు..

గత ఎన్నికల సమయంలో జరిగిన తప్పిదాలను.. నేతల పనితీరును జగన్మోహన్ రెడ్డి సమావేశంలో నేతలకు వివరించారు.. ఇదే సమయంలో కొన్ని కీలక మార్పులు సైతం చేశారు.. గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయ్ సాయి రెడ్డిని.. పక్కన పెట్టారు.. నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులుగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు.. సిటీ నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు..

కృష్ణ చైతన్య విద్యాసంస్థల అధినేతగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సిటీ నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి.. వచ్చే ఎన్నికల నాటికి సిటీ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యతలను జగన్ ఆయనకు అప్పగించారు.. సిటీ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగూరు నారాయణ స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు.. చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారని జిల్లాలో టాక్ నడుస్తోంది..

రూరల్ నియోజకవర్గం బాధ్యతలను ఆనం కుటుంబానికి చెందిన ఆనం విజయకుమార్ రెడ్డికి జగన్ అప్పగించారు.. రూరల్ నియోజకవర్గం లో ఆనం కుటుంబానికి మంచి పట్టు ఉంది.. నియోజకవర్గంలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.. ఆయా ప్రాంతాల్లో పార్టీకి కూడా అభిమానులు ఎక్కువగా ఉన్నారు.. ఈ క్రమంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి సేవలను పార్టీ ఉపయోగించుకోవాలని జగన్ భావించారు.. దూకుడు స్వభావం కలిగిన ఆనం విజయకుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే..

టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎత్తులను చిత్తు చెయ్యొచ్చని.. జగన్ భావించారట.. గత ఎన్నికల్లోనే రూరల్ టికెట్ ఆనం విజయకుమార్ రెడ్డికి కేటాయించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు.. ఈ క్రమంలో విజయ్ కుమార్ రెడ్డి కూడా ఆదాల వెంట నడిచారు.. అయినప్పటికీ రూరల్ భారీ ఓట్ల తేడాతో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండేలా జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ అప్పగిస్తారని గతంలో ప్రచారం జరిగింది.. కానీ జగన్ ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.. మరో మూడేళ్లలో సిటీ, రూరల్ నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలుగా విభజన జరగబోతోంది.. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ను సిటీ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి అబ్జర్వర్ గా నియమించారు.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మూడో నియోజకవర్గంలో ఏర్పాటు అయితే..

అక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ ని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు.. అందుకోసం ఇప్పటినుంచి గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తుంది.. జిల్లా అధ్యక్షునిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి మరోసారి బాధ్యతలు అప్పగించారు.. జిల్లాలోని అన్ని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో విస్తృత పరిచయాలు కలిగిన కాకాణి మాత్రమే సమర్థవంతంగా పని చేస్తారని.. జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారట.. వచ్చే ఎన్నికల నాటికి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఇప్పటినుంచి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news