న‌టి పై దాడి ! సెల్ ఫోన్ చోరీ

-

హైద‌రాబాద్ న‌గ‌రంలో న‌టి షాలు చౌరాసియా పై దాడి జ‌రిగింది. షాలు చౌరాసియా మార్నింగ్ వాకింగ్ కు హైద‌రాబాద్ లోని కేబీఆర్ పార్క్ కి వ‌చ్చింది. అక్క‌డ షాలు చౌరాసియా వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఒక ఆక‌తాయి దాడి చేశాడు. అంతే కాకుండా షాలు చౌరాసియా మొబైల్ ఫోన్ ను లాక్కెళ్లాడు. షాక్ నుంచి తెరుకున్న షాలు చౌరాసియా 100 కు డ‌య‌ల్ చేసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. అయితే ఈ ఘ‌ట‌న లో స్వ‌ల్పంగా గాయ ప‌డ్డ షాలు చౌరాసియా ను ద‌గ్గ‌ర్లో ఉన్న ఒక ప్ర‌యివేటు ఆస్పత్రి కి త‌ర‌లించారు.

అయితే ఈ షాకింగ్ ఘ‌ట‌నకు సంబంధించి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగ షాలు చౌరాసియా ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ్ లో ఎన్ క‌డ‌లి సీన్ పోదురా అనే సినిమా చేసింది. అలాగే తెలుగు లో ఓ పిల్లా నీ వ‌ల్లా అనే సినిమా కూడా చేసింది. దీంతో పాటు ఆర‌ణ్యంలో అనే సినిమా లో కూడా చేసింది. అలాగే పెల్లంటే అనే సినిమాలో కూడా షాలు చౌరాసియా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news