కుక్కలకి విషం పెట్టి చంపి.. అర్ధరాత్రి అమ్మాయి మీద పెట్రోల్ దాడి.. బావ పనేనా !

-

మరో వారం రోజుల్లో ఆ యువతి పెళ్లి. ఇంతలోనే దారుణం జరిగింది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అయితే మరదలిపై కన్నేసినా అక్క మొగుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు  స్దానికులు.. చిత్తూరు జిల్లా గట్టుకిందపల్లిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. 24ఏళ్ళ సుమతి అనే యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న ఈ సమయంలో హత్యాయత్నం జరిగినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో ఘటనా స్థలిలో శునకాలు, కోళ్లు కూడా చనిపోయి ఉండటం సంచలనంగా మారింది. ఇంటి దగ్గర పెంచుకుంటున్న కుక్కలు మెురగకుండా విష ప్రయోగం చేసి ఆ అనంతరం ఆవిడ మీద పెట్రోల్ పోసి నిప్పంటించారని బాధితురాలి తండ్రి చెప్పుకోచ్చాడు. ఈ యువతిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నం చేసిన అక్క భర్తే ఇది చేసాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన లో 15 కోళ్లు, రెండు కుక్కలు, ఒక పిల్లి మృతి చనిపోయాయి..ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news