మున్సిపల్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..!

-

మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మున్సిపల్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది ఓ  కుటుంబం. అయితే  నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని పెట్రోల్ డబ్బాతో బైఠాయించారు.   వివరాల్లోకి వెళితే.. తెలంగాణ లోని  నిర్మల్‌లోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన శక్కరి రమేష్ అనే కుటుంబ తన పాత ఇంటిని కూలగొట్టి నూతన ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే ఇంటి నిర్మాణ కొరకు మున్సిపల్ అధికారులు అనుమతులు జారీ చేశారు.. అయితే ప్రతిరోజు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం కాగానే మున్సిపల్ అధికారులు సామాగ్రిని ఎత్తుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగకపోవడంతో ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని పేర్కొన్నారు. అనంతరం అధికారులు రాకపోవడంతో పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు కలగజేసుకొని చేతిలో నుంచి డబ్బాను లాక్కొని అడ్డుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news