40 ఏళ్ళకు ఒకసారి గుడి తలుపులు తీస్తారు… కేవలం 48 రోజులే దర్శనం… ఆ గుడి ఎక్కడ…?

-

దేశంలో దేవాలయాలు ఎక్కువగా రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి… పురాతమైన దేవాలయాలకు ఆ రాష్ట్రం ప్రసిద్ది చెందింది… ఎన్నో పురాతనమైన దేవాలయాలు అక్కడ ఉండటంతో దేశం నలుమూలల నుంచి భక్తులు వెళ్తూ ఉంటారు. అందుకే అక్కడి ప్రభుత్వాలు కూడా దేవాలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. ఇక వందల ఏళ్ళ నాటి దేవాలయాలు అక్కడ చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇందుకోసం అక్కడి భక్తులే ప్రత్యేక చర్చలు తీసుకుని అక్కడి దేవాలయాలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

తాజాగా అక్కడి ఒక ఆలయం గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఆ దేవాలయం తలుపులు తెరుస్తారట. కాంచీపురంలో ఉండే అత్తి వరదరాజస్వామి 40 ఏళ్లకొకసారి భక్తులకు దర్శనం ఇస్తుంది. 1979లో తెరిచిన ఈ దేవాలయం మళ్ళి ఈ ఏడాది జూన్‌ 1న తెరిచారు. 40 ఏళ్లకు ఒకసారి అది కూడా 48 రోజులు మాత్రమే ఉంటారు. దీనితో ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ దేవాలయాన్ని చూడటానికి భక్తులు వస్తున్నారట. శయన స్థితిలో తొలి 38 రోజుల పాటు ఉండటం…

ఆ తర్వాత నిలబడినట్లు మిగిలిన 10 రోజులు భక్తులకు దర్శనమిస్తారు. 16వ శతాబ్దంలో కాంచీపురంపై జరిగిన దండయాత్రలో ఈ దేవాలయం దోపిడీకి గురైందని అక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడి భక్తులు కొందరు విగ్రహాన్ని కాపాడేందుకు దానిని వెండి పెట్టెలో పెట్టి కోనేరులో భద్రపరిచారట. అత్తితో చేసిన ఆ విగ్రహం ఎన్నో ఏళ్లు నీటిలో ఉన్నా సరే ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటంతో దానిని మళ్ళీ తిరిగి గుడిలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారట. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్ట్ 17 వరకు తెరిచి ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version