వంగసాగులో చీడపీడలు…నివారణకు ఇలా చేసేయండి.!

-

కూరగాయల సాగులో అనువైన పంట వంకాయ. ఇళ్లలో కూడా తేలిగ్గా పండించుకోవచ్చు. సరైన సస్యరక్షణ చర్యలు , జాగ్రత్తలు పాటిస్తే వంగసాగులో నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా వంగలో వచ్చే చీడపీడలు, వాటి నివారణ గురించి రైతులు సరైన అవగాహన కలిగి ఉండాలి.

వంగలో వచ్చే చీడపీడలు;

కాయతొలుచు, మొవ్వ తొలచు పురుగు ; వంగ పంటకు వచ్చే పురుగుల్లో అతి ముఖ్యమైనది కాయ తొలుచు పురుగు. ఈ పురుగు విత్తనాలు నాటిన 30-40 రోజుల నుండి పంటను ఆశించి, నుమారుగా 10-80 శాతం వరకు నష్టం కలుగజేస్తాయి.. మొక్క పెరిగే దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి వేస్తుంది. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. కాయలు వంకర్లు తిరుగుతాయి. తల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో గుడ్లు పెడతాయి. గుడ్డ నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కొమ్మలను, పూలను, కాయలకు తీవ్రంగా నష్టపరుస్తాయి.
దీని నివారణకు నారుమడి నుంచి నారును ప్రధాన పొలంలో నాటే ముందు మొక్క వేర్లను రైనాక్సిఫైర్‌ 0.5 మి.లీ. లీటరు నీటికి కలిపి 3 గంటలు నానబెట్టి తర్వాత నాటుకోవాలి. పురుగును గుర్తించిన మొదటి దశలోనే ఆశించిన కొమ్మలను తుంచి కాల్చివేయాలి. పొలంలో లింగాకర్షక బుట్టలను ఎకరాకు 10 చొప్పున అమర్చితే మగ పురుగులు, అకర్షితమై, బుట్టలో పడి చనిపోతాయి.
ఈ బుట్టల ద్వారా పురుగు ఉనికి, ఉద్ధృతి తెలుసుకొని సరైన నమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టుకోవచ్చు. పూతదశలో వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి. వేపనూనె తల్లి పురుగులకు వికర్షికంగా పనిచేసి గుడ్లను పెట్టకుండా చేస్తుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే.. స్పైనోసాడ్‌ 0.3 మి.లీ.లేదా క్లోరాంట్రనిలిప్రోల్‌ 0.3 మి.లీ.లేదా ఫ్లూబెండియమైడ్‌ 0.2 మి.లీ. లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

అక్షింతల పురుగు:

పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల అకులు జల్లైడలా తయారవుతాయి. ఈ పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మాత్రమే మిగిలి మొక్కలు ఎండిపోతాయి. గుడ్లను, పిల్ల పురుగులను ఏరి నాశనం చేయాలి. పురుగు ఆశించిన వెంటనే వేప నూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి.

ఎర్రనల్లి:

ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల అకులు పాలిపోయి తెల్లగా అవుతాయి.. ఆకులపై సాలెగూడు. వంటి తీగలు ఏర్పడి పంటకు నష్టం కలిగిస్తాయి… వీటి నివారణకు లీటరు నీటికి 3గ్రా.నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ. డైకోఫాల్‌ లేదా ౩ మి.లీ. స్పైరోమెసిఫెన్‌ లేదా 3 మి.లీ ప్రోపర్‌ గైట్‌ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకుంటే సరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version