T20 world Cup : 73 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్

-

టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయిలోని ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతోంది. అయితే ఇందు లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా దేశ్ జట్టు … కేవలం 73 పరుగుల కే కుప్ప కూలింది. 15 ఓవర్లు ఆడిన బంగ్లా దే శ్ జట్టు.. 73 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు అందరూ బ్యాట్స్మెన్ విఫలం కావడంతో 73 పరుగులు చేసింది. గా ఆస్ట్రేలియా జట్టు బౌలర్ల లో ఆడం జంపా ఏకంగా 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లలో నడ్డి విరిచారు. అలాగే మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు, హజల్ వుడ్ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించారు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు గెలవాలంటే 20 ఓవర్లలో 74 పరుగులు చేయాల్సి ఉంది. మరికాసేపట్లో నే ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version