Mega154 : “చిరు154” నుంచి అదిరిపోయే అప్డేట్… ఇక పునకాలే !

-

మెగాస్టార్ చిరంజీవి… ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి… మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు. అందులో ఒకటే మెగాస్టార్ 154 సినిమా. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో ఈ సినిమా నుంచి… ఓ అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం.

ఈ మేరకు #పూనకాలులోడింగ్ అనే హాట్ స్టార్ తో ఓ పోస్టర్ ను కూడా వదిలేసింది. ఈ సినిమా పూజా కార్యక్రమం నవంబర్ 6వ తేదీన ఉదయం… 11:43 గంటలకు జరగనున్నట్లు ఈ పోస్టర్ లో పేర్కొంది. అలాగే 12 గంటల సమయంలో మెగాస్టార్ దర్శనం ఇవ్వనున్నట్లు కూడా స్పష్టం చేసింది చిత్రాలున్నాయి. ఈ అప్డేట్ తో మెగా స్టార్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version