ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ షాన్ మార్ష్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పాటు, అంతర్జాతీయ వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఇకపై టి20 లోనే కొనసాగుతానని స్పష్టం చేశాడు. షాన్ మార్ష్ 2019 లోనే టెస్టులకు గుడ్ బై చెప్పాడు.
2001లో 17వ ఏట షాన్ మార్ష్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 236 మ్యాచుల్లో 12,811 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు సాధించాడు. 2022లో షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీని వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు షాన్ మార్ష్ అందించాడు. లిస్ట్-ఎ కెరీర్ లో 177 మ్యాచులు వాడిన మార్ష్, 44.45 సగటుతూ 7158 పరుగులు చేశాడు.