ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా రాత్రి 7.30 గం.కు ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ విరాట్ కోహ్లీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
విరాట్ కోహ్లీ ఆటతీరుపై ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌పై ఫించ్ ప్రశంసలు కురిపించాడు. కచ్చితమైన ప్లానింగ్ ఉంటే తప్ప విరాట్‌తో తలపడి గెలవడం అంత సులభం కాదన్నాడు. కోహ్లీ ఓ గొప్ప ప్లేయర్ అని కొనియాడాడు.
“విరాట్ లాంటి ప్లేయర్‌ను ఎదుర్కోవడమంటే ధైర్యంతో కూడుకున్న పని. పదిహేనేళ్లుగా అతడు సాధించిన విజయాలు తననెప్పటికీ గొప్ప ప్లేయర్‌గానే గుర్తుచేస్తాయి. ముఖ్యంగా టీ20ల్లో అతడు తన ఆటతీరును మలుచుకున్న విధానం వల్ల విరాట్‌తో తలపడాలంటే ఎవరైనా కచ్చితమైన ప్లాన్‌తో వెళ్లాల్సిందే. 71 సెంచరీలు కొట్టడమేంటే నమ్మశక్యం కాని విషయం. అతడో గొప్ప ప్లేయర్..” అంటూ ఫించ్ విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు.