UPలో దారుణం..టాయిలెట్లలో కబడ్డీ ప్లేయర్లకు భోజనాలు..వీడియో వైరల్

-

బీజేపీ పాలిస్తున్న రాష్ట్రంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం ఒకటి. ప్రస్తుతం యూపీ సీఎం గా యోగి కొనసాగుతున్నారు. అయితే.. యోగి పాలిస్తున్నటు వంటి ఉత్తర ప్రదేశ్‌ లో తాజాగా ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. కబడ్డీ ప్లేయర్లకు బాత్రూంలలో భోజనాలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… యోగి రాష్ట్రంలో.. తాజాగా ఓ కబడ్డీ టోర్నమెంట్‌ జరిగింది. ఇందులో దాదాపు.. అండర్‌ 19 లోపు వారు పాల్గొన్నారు. అయితే.. వారికి యోగి సర్కార్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.. కానీ.. తినే ఆహారాన్ని మాత్రం టాయిలెట్లలో ఏర్పాటు చేసి.. వారిని అవమానించింది.

లంచ్‌ సమయంలో.. క్రీడాకారులంతా.. ఆ బాత్రూంల్లోకి వచ్చి.. అక్కడ ఉన్న ఆహారాన్ని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. ఇక ఈ వీడియోను చూసిన.. నెటిజన్లు..యోగి సర్కార్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ అంటే ఇదేనా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news