నిన్న ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన జరిగిన మొదటి వన్ డే లో భాగంగా టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మరో ఓవర్ మిగిలి ఉండగానే 222 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నాస్ మొక్కవోని దీక్షతో కెప్టెన్ బావుమా సెంచరీ చేసి జట్టుకు ఆమాత్రం స్కోర్ సాధించి పెట్టాడు. ఆ తరువాత 223 పరుగుల లక్ష్యంతో ఛేదన స్టార్ట్ చేసిన ఆసీస్ కు ఏమంత మంచిగా సాగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయి 113 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఈ దశలో ఆస్ట్రేలియా టెస్ట్ బ్యాట్స్మన్ మార్నష్ లాబుచెన్ క్రీజులోకి వచ్చి బౌలింగ్ ఆల్ రౌండర్ అష్టన్ అగర్ తో కలిసి ఎనిమిదవ వికెట్ కు 112 పరుగులు జోడించి ఆస్ట్రేలియాకు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు.
లాబుచెన్ పరుగులు చేసి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు, ఇతనికి అగర్ 48 పరుగులు నుండి చక్కని సహకారం లభించింది. ఇప్పటికే టీ సిరీస్ ను పోగొట్టుకున్న సౌత్ ఆఫ్రికా, వన్ డే లలోనూ మొదటి మ్యాచ్ ను కోల్పోయింది. మరి రెండవ మ్యాచ్ లో అయినా పుంజుకుంటుందా చూడాలి.