యూరప్ లో కరోనా కల్లోలం… ఆ దేశంలో లాక్ డౌన్..

-

యూరప్ లో కరోనా కల్లోలం కలిగిస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా, రష్యా దేశాల్లో కరోనా మరణ ఘంటికలు మోగిస్తోంది. ఆయా దేశాల్లో రోజుకు సగటు 30 వేల కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటున్నాయి. యూరప్ లో నాలుగో వేవ్ ప్రారంభమైనట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత కారణంగా పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ ఆలోచనల్లోకి వెళుతున్నాయి.

తాజాగా ఆస్ట్రియా దేశం కరోనా తీవ్రత కారణంగా లాక్ డౌన్ విధించింది. నేటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. వైరస్​ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో 10 రోజులు లాక్​డౌన్​ పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా పౌరులెవరు బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలను విధిస్తామని ప్రభుత్వం తెలిపింది.

లాక్ డౌన్ విషయంలో ఆస్ట్రియా ఛాన్సలర్​ అలెగ్జాండర్ షాలెన్​బర్గ్ క్షమాపణలు చెప్పారు. టీకాలు తీసుకున్నవారు ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతుండటంతో క్షమాపణలు చెప్పారు. ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసమే లాక్ డౌన్ విధించినట్లు షాలెన్ బర్గ్ తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news