మూడు రాజధానులపై కాసేపటి క్రితమే సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. తాము మూడు రాజధానుల చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే… ఏపీ రాజధాని చట్టాల ఉప సంహరణ తాత్కాలికమేనని స్పష్టం చేశారు సీఎం జగన్. మళ్లీ మెరుగ్గా బిల్లు సిద్దం చేసి వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళతామని స్పష్టం చేశారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని వర్గాలకు వివరించేందుకు.. బిల్లులు మరింత మెరుగు పరిచేందుకు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్ని ప్రాంతాలకు వివరించేందుకు గతంలో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకున్నామని… మళ్లీ సమగ్ర, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు సీఎం జగన్. రెండేళ్ల నుంచి మూడు రాజధానులపై న్యాయపరమైన చిక్కులు సృష్టించారు.. అపోహలు కల్పించారని… రాజధాని వికేంద్రకరణ ప్రారంభమై ఉంటే.. ఈ పాటికే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని వెల్లడించారు.