హైదరాబాద్ లో వరదలు.. వారి ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం..?

-

ఇటీవల కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం వరదల్లో మునిగి పోయిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో కాలనీలు రోడ్లు అనే తేడా లేకుండా పూర్తిగా జలమయమయ్యాయి. ఎటు చూసిన నీరే కనిపించడంతో పెద్ద పెద్ద చెరువులను తలపించాయి అన్ని ప్రాంతాలు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు మరోసారి హైదరాబాద్ నగరంలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కీలక చర్యలు చేపడుతున్నారు.

ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కారణంగా హైదరాబాద్ నగరం మొత్తం వరదల్లో తీవ్ర నష్టాన్ని చవి చూసింది అని భావించిన అధికారులు… వరదల విలయానికి ప్రధాన కారణమైన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం లోని పటేల్ నగర్ లో నాలాల పై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు అధికారులు. స్థానిక ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాల కూల్చివేతను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, కాగా నిన్న మల్కాజిగిరి లో పర్యటించిన మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇలా అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news