బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. ఆ తరవాత ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. దాంతో అతడితో జీవితం అనుకుని ఎన్నో కలలు కన్నది. కానీ ఆ కలలు అన్నీ ఆవిరైపోయాయి. ముచ్చట తీరాక ప్రియుడు ముఖం చాటేశాడు. రెండేళ్లు వెంట తిప్పుకుని ఆ తరవాత పెళ్లికి నో చెప్పాడు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.

ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…22 ఏళ్ల బీటెక్ విద్యార్థిని చంపా పేట్ కు చెందిన శంకర్ అనే ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. కాగా రెండేళ్లు తన వెంట తిప్పుకుని ఇప్పుడు అతడు ముహం చాటేస్తున్నాడు అంటూ బాధిత యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిందితుడు పరారీలో ఉండటం తో పోలీసులు అతడి కోసం గాలింపులు చేపడుతున్నారు.