మనం ఎన్నో అనుకుంటాం అయితే అన్ని జరగాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి మనకు ఎదురయ్యే పరిస్థితులు కారణంగా మనం రూట్ మారవలసి వస్తుంది. ఒకటి అనుకుని మనం ముందుకు వెళుతూ ఉన్నాసరే కొన్ని అడ్డంకులు వలనో బాధ్యతల వలనో వెనకడుగు వేయాల్సి వస్తుంది. నిజానికి మన పరిస్థితులు కూడా మన యొక్క స్థితిని మార్చేస్తూ ఉంటాయి.
ఎప్పుడైనా సరే పరిస్థితులు కాని అడ్డంకులు కానీ లేదంటే ఇతర సమస్యలు కానీ కలిగినా అనుకున్న దారిలో మనం వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించడానికి అవుతుంది. కొంతమంది ఎదుర్కొనే అడ్డంకుల వల్ల కలల్ని కూడా చంపుకుంటారు.
ఆర్ట్ ఎంత ఉన్నా అనుకూలంగా పరిస్థితులు లేకపోవడం వల్ల దారిలోనే వెనక్కి వెళ్ళి పోతూ ఉంటారు. కానీ అది మంచి పని కాదు ఈరోజు కాకపోతే రేపు మనం అదే దారిలో వెళ్లొచ్చు అని నమ్మకంతో ఉంటే కచ్చితంగా ఏదో రోజు అనుకున్నది సాధించడానికి అవుతుంది.
ఈ ఆటోవాలా కూడా అనుకున్నది వెంటనే సాధించలేకపోయారు కానీ కాస్త సమయం తీసుకుని మళ్లీ అనుకున్నది సాధించారు చిన్నప్పటి నుండి ఈ ఆటో నడిపే వ్యక్తికి మ్యూజిక్ అంటే ఇష్టం. గాయకుడు అవ్వాలని అనుకున్నారు కానీ కుటుంబ పరిస్థితి కారణంగా గాయకుడు అవ్వలేకపోయారు. ఆటోను నడుపుతూ ప్రతిరోజూ 500 రూపాయలు సంపాదించి కుటుంబ ఖర్చులకోసం వాటిని ఇంటికి పంపించేవారు.
ఈ సమయంలో పాటల్ని పక్కన పెట్టేశారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కలని నెరవేర్చుకున్నారు కుటుంబసభ్యులతో పాటు కూర్చుని గిటార్ ప్లే చేస్తూ ఎంతో ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు. పాటల తాలూక వీడియోలను ఆన్లైన్ లో పోస్ట్ చేస్తే.. ఎంతో మంది అభినందించారు ఇప్పుడు అతను ఆటో నడుపుతున్నారు మరియు మ్యూజిషియన్ కూడా. ఈ ఆటోవాలా కథను అఫీషియల్ హుమన్స్ ఆఫ్ బొంబాయి ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.