ఏపీ బీజేపీ రెండు రకాలుగా విడిపోయిందని ఏపీ మంత్రి అవంతి పేర్కొన్నారు. ఆర్.ఎస్.ఎస్.భావజాలంతో పనిచేసే పాత బీజేపీ ఒకటైతే….చంద్రబాబు మనుషులతో నిండిన కొత్త బీజేపీ మరొకటని అన్నారు. కొత్త బీజేపీ ట్రాప్ లో పడవద్దని సోమువీర్రాజును కోరుతున్నానని ఆయన అన్నారు. బీజేపీ రథయాత్ర వెనుక అజెండా ఏంటి…? రాముడు ముందు పుట్టాడా..?.బీజేపీ ముందుపుట్టిందా..? అని ఆయన ప్రశ్నించారు.
అంతర్వేదిలో రథం దగ్ధం అయిన ఘటనలో సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం కోరి నాలుగు నెలలు అయినా కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్,బీజేపీలు అమాయకులుగా భావిస్తున్నాయన్న ఆయన ప్రాంతాలు,మతాల మధ్య విభేదాలు సృస్టించే వైఖరిని విడనాడాలని కోరుతున్నామని అన్నారు. విశాఖ రైల్వేజోన్ ప్రకటన చేసి ఎందుకు వదిలేశారు…కర్నూల్ న్యాయరాజధానికి బీజేపీ అనుకులమో…వ్యతిరేక మో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మత, కుల,సెంటిమేంట్ రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని మంత్రి పేర్కొన్నారు.