12 ఏళ్ల తర్వాత‌ ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం..

-

దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ఖననం చేయబడిన ఆయేషా మీరా మృతదేహాన్ని మరోసారి బయటకు తీసి రీ పోస్ట్ మార్టమ్ చేయించాలని సీబీఐ భావిస్తోంది. డిసెంబర్ 20లోగా రీపోస్టుమార్టం నిర్వహించాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులు స్థానిక అధికారులను సంప్రదించారు. ఇక విజయవాడలో 12 ఏళ్ల క్రితం అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన ఆయేషామీరా హత్యకేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. తెనాలికి చెందిన ఆయేషామీరా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కళాశాలలో భీఫార్మసీ చదువుతూ, దుర్గా హాస్టల్‌లో ఉండేది.

అయితే ఆమె చేరిన మొదటి సంవత్సరంలోనే, 2007 డిసెంబర్‌ 27న హాస్టల్‌ గదిలో అత్యాచారం, హత్యకు గురైంది. అయితే ఈ కేసులో కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల పుత్రులు ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా, అవి నిరూపితం కాలేదు. కేసుకు సంబంధం లేని సత్యంబాబు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘకాలం పాటు కేసు సాగగా, తొమ్మిదేళ్ల జైలు జీవితం అనంతరం సత్యం బాబు నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఆపై కేసులో అసలు నిందితులు ఎవరో తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. కాగా, కొన్ని నెలల క్రితమే మృతదేహం అవశేషాలను బయటకు తీయాలని భావించినా, కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version