రాముడిదే అయోధ్య..|

-

దాదాపు 15 శతాబ్ధాలుగా నానుతూవస్తోన్న.. అత్యంత సున్నితమైన కేసు అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెల్లడించింది. వివాదాస్పదమైన అయోధ్య రామజన్మభూమి స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. అయితే 1856 నుంచి హిందూ, ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటుచేసే ఆలయ ట్రస్ట్‌కు అప్పగించాలని సుప్రీం, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తంతును మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది.

అదే సమయంలో అయోధ్యలో ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. అయెధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మత విశ్వాసాల ఆధారంగా కాకుండా పురావస్తు శాఖ నివేదిక ప్రాతిపదికనే సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించినట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news