సీఎం రేవంత్ రెడ్డిది అబద్దాల పాలన : ఎమ్మెల్సీ కవిత

-

బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం నిజామాబాద్ లో మరో బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్  తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్  జిల్లాలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశామని.. దానిని వివరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఒకప్పుడు నీటితో నిండి కుండలా ఉండి, సిరులు పండించిన నిజామాబాద్ రైతులు.. మళ్ళీ యూరియా కోసం లైన్లు కడుతూ, వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు ఉంటుందో లేదో తెలియని స్థితిలో గోస పడుతున్నారని తెలిపారు.

ఒక్క చెరువును ఏ నాయకుడు గాని, అధికారి గాని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువునా మోసం చేస్తుందని మండిపడ్డారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఫైర్ అయ్యారు. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని, అబద్దం అం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి బొమ్మ కనబడుతుంది కవిత ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news