రాష్ట్ర మంత్రి అప్పలరాజు సవాలును మాజీ మంత్రి అయ్యన్న స్వీకరించారు. మంత్రి అప్పలరాజు రాజీనామా చేస్తే మేము ఎన్నికల్లో పాల్గొని విజయం సాధిస్తామన్న ఆయన దమ్ముంటే మంత్రి రాజీనామా చేయాలని అన్నారు. నాడు నేడు పేరుతో అధికార పార్టీ నాయకులు కోట్ల నిధుల దోపిడీకి పాల్పడుతున్నారని, గతంలో అభివృద్ధి చేసిన పాఠశాలలకే మళ్లీ రంగులద్ది నిధులు కాజేస్తున్నారని అన్నారు. పాఠశాలలకు వాడే సామగ్రి సరఫరా సైతం ఎటువంటి టెండర్లు నిర్వహించకుండా, తన వారికి కట్టబెట్టి ప్రభుత్వ నిధులు కాజేస్తున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం లో విద్యార్థులకు సరఫరా చేసే వాటికి అదనంగా జతచేసి, దేశంలోనే ఎక్కడా ఇవ్వలేదంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అయ్యన్న అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన కోట్ల విలువైన సైకిళ్లను పంపిణీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆయన అన్నారు. జగన్ విద్యా కానుక కొత్తది కాదు, సోకులు అది కొత్తగా చెప్పుకుంటున్నారని అన్నారు. జగన్ చేసింది తక్కువ పబ్లిసిటీ పిచ్చి ఎక్కువని అన్నారు. చివరకు స్మశానలకు, పుస్తకాలకు, మీ పార్టీ రంగు వేశారన్న ఆయన బెల్ట్ మీద కూడా జగనన్న పేరు రాసుకుంటున్నారని అన్నారు. నాడు నేడు మంచిదేనన్న ఆయన కానీ బాగున్న స్కూల్స్ మళ్లీ పనులు చేయడం సరికాదు. బాగోలేని స్కూల్స్ పై దృష్టి పెట్టండని అన్నారు.