సీఎం జగన్ ఫోటోల పిచ్చి కారణంగా రైతుల ఇళ్లల్లో పెళ్లిళ్లు నిలిచిపోతున్నాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ జీవో జయరాం కి కంప్లైంట్ చేశారు. తర్వాత అయినా మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం మండలం గుబ్బాడ కి చెందిన బండారు రాజేశ్వరి కుటుంబ సభ్యులు పెళ్లి కోసం భూమిని తనఖా పెట్టుకుని తొమ్మిది లక్షల లోన్ కోసం దరఖాస్తు చేశారని చెప్పారు.
నర్సీపట్నం డివిజన్ శాఖలో ఆమోదం పొంది జిల్లా కేంద్రానికి వెళ్లిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేశారని చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకం పై ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో వలన
వెబ్ అప్లోడ్ కి నిరాకరిస్తుందని అధికారులు చెప్పినట్లు అయ్యన్న చెప్పారు. అందువలన రుణం ఇచ్చేందుకు వీలు కాలేదని చెప్పారు దీంతో పాటు ప్రచారానికి సంబంధించి అనుమతి ఇచ్చే విధానాన్ని సరళతరం చేయాలని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.