తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామరావు పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చింది.. ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వళ్లే.. తాను ఈ స్థానంలో ఉన్నానని అన్నారు. తనకు 1983లో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే ను అయ్యానని తెలిపారు. దానికి కారణం ఎన్టీఆర్ అని అన్నారు. 1985 లో మరోసారి ఎన్నికలు వచ్చిన సమయంలో ఖర్చలు లేక పోతే.. ఎన్టీఆర్ తో ఉన్న ఫోటోతో ప్రచారం చేసి గెలిచానని వివరించారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ముఖానికి రంగు వేసుకున్న వాడికి రాజకీయం ఏంటని కొంత మంది అన్నారని తెలిపారు. అయితే కొద్ది రోజులకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. తనను 1985 లో మంత్రిని చేస్తూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆయన నిర్ణయానికి తాను కూడా ఆశ్చర్యపోయానని తెలిపారు.
ఎన్టీఆర్ సిద్ధంతాలు చాలా గొప్పవని అన్నారు. ఆయన సిద్ధంతాలను ఈ తరం నాయకులకు బోధించాలని సూచించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో యువతకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అలా చేస్తు.. మరో 40, 50 ఏళ్ల వరకు అధికాంలోనే ఉంటామని తెలిపారు.