తల్లిని, చెల్లిని.. జగన్‌ ఎడమకాలితో తన్నేపడేశారు : అయ్యన్న సంచలన ట్వీట్‌

-

వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డిలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు…తన సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవడికో పుట్టిన బిడ్డ వైఎస్సార్సీపీని మీ బిడ్డ అని చెప్పుకోవడానికి ఇసుమంత సిగ్గు కూడా లేని మీరు ఇతర పార్టీల గురించి మాట్లాడటం వింతగా ఉందంటూ విజయ సాయి రెడ్డిపై ఫైర్‌ అయ్యారు.

వైసీపీ జగన్ బిడ్డ కాదు కాబట్టే ఆవిర్భావ దినోత్సవానికి సవతి తండ్రిలా ఒక ట్వీట్ పడేసి వదిలేసారని నిప్పులు చెరిగారు అయ్యన్న. అధికారం కోసం తల్లిని, చెల్లిని వాడుకున్న జగన్.. కుర్చీ దక్కగానే వారిని ఎడమ కాలితో పక్క రాష్ట్రానికి తన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయ్యన్న పాత్రుడు. కేరాఫ్ అడ్రస్ లేని దిక్కుమాలిన పార్టీ అధినేతకు.. విజయ సాయికి టీడీపీ గురించి మాట్లాడే అర్హత లేదని చురకలు అంటించారు.

అయితే.. అంతకు ముందు… టీడీపీ పార్టీ ఆవిర్భావంపై విజయసాయి సెటైర్‌ వేశారు. “ఎవరో (ఎన్టీఆర్) కన్న బిడ్డకు, ఇంకేవరో బర్త్ డే సెలెబ్రేట్ చేసినంత చంఢాలంగా ఉంది టీడీపీ ఆవిర్భావ కార్యక్రమం. అది చంద్రబాబు పెట్టిన పార్టీ కాదు. ఎన్టీఆర్ నుంచి దొంగతనంగా గుంజుకున్నదని ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు కపట వేషాలు చూస్తూ ఆ పెద్దాయన ఆత్మ ఎంతగా క్షోభిస్తొందో!” అంటూ విజయసాయి సెటైర్‌ వేశారు. ఆయనకు ట్వీట్‌ కు అయ్యన్న కౌంటర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version