రేపటి నుంచి అయ్యప్ప దర్శనం..144 సెక్షన్ విధింపు?

-

కేరళలోని శబరిమల ఆలయాన్ని సోమవారం నుండి తెరిచి అయ్యప్ప భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఆర్పీసీ సెక్షన్‌ 144 విధిస్తూ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలావుంకల్‌, నిలాక్కల్‌, పంబ మరియు సన్నిధానం ప్రాంతాలలో ముగ్గురు కంటే ఎక్కువ మంది గుంపుగా ఉండరాదని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల భారీ బలగాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

10 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలకు ఆలయంలోకి ప్రవేశాన్ని అనుమతిస్తూ ఇటీవల సుప్రీం ఇచ్చిన తీర్పు అనంతరం కొందరు మహిళా భక్తులు, జర్నలిస్టులు అయ్యప్ప సన్నిధికి వెళ్లేందుకు ప్రయత్నించగా భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు వారిపై దాడి చేశారు. దేశ వ్యాప్తంగా తీర్పుని పున: సమీక్షించాలంటూ నిరసన ర్యాలీలు జరిగాయి. ఇందుకు  సంబంధించి రివ్వూ పిటిషన్ కూడా ప్రస్తుతం సుప్రీం లో పెండింగ్ లో ఉంది. ఏళ్ల తరబడిగా వస్తున్న ఆచారానికి సుప్రీం తీర్పుతో అడ్డుకట్టవేయాలని చూడటాన్ని భక్తులు తప్పుబట్టారు. అయ్యప్ప ఆలయానికి సుప్రీం తీర్పుతో రాజకీయ ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్న విషయాన్ని గమనించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news