జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు ని పవన్ కళ్యాణ్ అందించారు. అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ స్థానాలకు బీ ఫారాలు ఇచ్చారు పవన్. తొలి బీ-ఫారం ని నాదెండ్ల మనోహరుకు పవన్ ఇచ్చారు. రేపట్నుంచి నామినేషన్లు ఉండడంతో ఇవాళే బీ-ఫారాలు ని పవన్ ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంది. ఓట్లు చీలకుండా ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాం అని ఈ సందర్భంగా పవన్ చెప్పారు. రాక్షస పాలనను అంతమొందించాలి.
ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలి అని పవన్ అన్నారు . ఎన్నో ఇబ్బందులు.. ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పవన్ పార్టీని నడిపారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి. వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నాం. సమర్థులైన అభ్యర్థులను పవన్ ఎంపిక చేశారు అని నాదెండ్ల మనోహర్ అన్నారు.