గుడ్ న్యూస్ : హుజురాబాద్ నియోజక వర్గానికి మెడికల్ కాలేజ్…

-

ఉప ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ గెలిచిన తరువాత హుజురాబాద్ పట్టణం – జమ్మికుంట మధ్య మెడికల్ కాలేజీ పెడుతామని ప్రకటన చేశారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ టీ ఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ లో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈటల ఎందుకు రాజీనామా చేసిండో ఇప్పటి వరకు చెప్పలేదని.. హుజురాబాద్ నియోజక వర్గ అభివృద్ధి పై ఇప్పటి వరకు ఈటల రాజేంధర్ మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు.

Huzurabad | హుజురాబాద్

ఆయన సొంత సమస్య, బాధలను నియోజకవర్గం ప్రజల మీద రుద్దుతున్నడని మండిపడ్డారు. హుజురాబాద్ రైల్వే లైన్ ను రిజెక్ట్ చేస్తే ఎంపీ బండి సంజయ్ ఎం మాట్లాడటం లేదని నిప్పులు చెరిగారు. బండి సంజయ్ కి చేతకాకపోయినా నేను పట్టుపట్టి హుజురాబాద్ రైల్వే లైన్ సంక్షన్ చేపిస్తానని హామీ ఇచ్చారు వినోద్ కుమార్. హుజురాబాద్ జమ్మికుంట ని కలిపి అర్బన్ డెవలప్ మెంట్ పెడతామని హామీ ఇచ్చారు వినోద్ కుమార్. రెండున్నర సంవత్సరాలనుండి కేంద్రం నుండి సంజయ్ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని.. ఈటల భాధలు వేరు అందుకే బిజేపి పార్టీ కి వెళ్లాడని ఫైర్ అయ్యారు. ప్రజలందరూ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news