స్కాట్‌ల్యాండ్‌కు చెందిన మాకల్లన్ కంపెనీ భారీ బాహుబలి స్కాచ్ విస్కీ బాటిల్‌ను తయారు చేసి గత సంవత్సరం గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకుంది. అయితే ఇప్పుడు మరో గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టేందుకు అడుగులు వేస్తోంది.. అంతేకాకుండా.. అదే సమయంలో ఓ మంచి పనికి పూనుకుంది. విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే ఇప్పటి వరకు భారీ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది మాకల్లన్ కంపెనీ మాత్రమే.. అయితే.. 311 లీటర్లు సామర్థ్యం కలిగిన ఈ బాటిల్ ను.. 32 సంవత్సరాల కింద తయారుచేశారు. అయితే.. త్వరలోనే ఈ స్కాచ్ విస్కీ బాటిల్ వేలం వేయబోతున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ది ఇంట్రెపిడ్గా గుర్తింపు పొందిన ఈ బాటిల్ ఐదు అడుగుల 11 అంగులాల పొడవు ఉంది. అంటే సగటు మనిషి ఎత్తు(5.5 ఫీట్స్) కంటే ఎక్కువే!.
ఈ కంపెనీ ఇదే పేరుతో తయారు చేసే 444 రెగ్యులర్ బాటిల్స్ కలిస్తే ఎంతో.. ఈ బాహుబలి విస్కీ బాటిల్ అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్కాట్‌ల్యాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ ఆక్షన్ హౌజ్.. లైఆన్ అండ్ టర్న్‌బుల్ ఈ వేలంపాటను మే 25వ తేదీన నిర్వహించనుంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఒక విస్కీబాటిల్ అత్యధికంగా 1.9 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు పద్నాలుగున్నర కోట్ల రూపాయల పైమాటే) అమ్ముడుపోయింది. ఈ రికార్డును ది ఇంట్రెపిడ్ బద్ధలు కొట్టే అవకాశం కనిపిస్తోంది.